Total Pageviews

Wednesday 2 March 2011

రైతు బతుకు

రైతు బతుకు బాటలో
మెతుకు వెతుకులాటలో
కష్టాలే పెట్టుబడి
కన్నీళ్ళే దిగుబడి

రుతుపవనాలు వచ్చాయి
కాలవలో నీళ్ళు
రైతు గుండెలో పరవళ్ళు


అల్ప పీడనం
వాయుగుండం
చేలలోనూ
రైతు కళ్ళలోనూ
నీళ్ళే నీళ్ళు

గురు మహా శివరాత్రి

విద్య నేర్పు ఒజ్జలెల్ల మహాదేవులే
అక్షరాల భిక్షనొసగు ఆదిభిక్షులే
అజ్ఞానం అంతు తేల్చు మహారుద్రులే
అరమరికలు లేనియట్టి భోళాశంకరులే

ఎందరో గురు మహాశివులు ...
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు

చిట్టి రాతలు

పుస్తకం నిండా 
జ్ఞాపకాల మేఘాలే
పుస్తకం మూసేస్తే
కళ్ళ నిండా వర్షాలే

రాముడు రావణుడు
ఎవరు అయినా ఒకటే
సీత కళ్ళల్లో కన్నీరే

ఆల్మట్టికి
రెండు వైపులా నీరే
ఓ వైపు కన్నీరు
మరో వైపు పన్నీరు

కాలుతోంది
తెలుగు పూల తోట
తమిళ కర్నాట
కన్నుల పంటగా

Thursday 24 February 2011

ఒంటరి

గువ్వకు రెక్కలు వచ్చాయి
ఒంటరయ్యింది గూడు
బిడ్డకు రెక్కలు వచ్చాయి
ఒంటరయ్యింది గుండె

ఆందరికీ నమస్కారం

ఇది నా బ్లాగు. దీనిని నేను కవితల కొలువుగా వాదాలని కోరుతున్నా....ఇందులో మీరు కూదా భాగస్వాములు కావాలని కోరుతున్నా...